Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట
ముదిగొండ భూ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవనంలో నిర్వహించిన ముదిగొండ భూ పోరాట అమరవీరుల వర్ధంతిలో ఆయన మాట్లాడారు. కూడు, గూడు లేని నిరుపేదలు ఇండ్ల నిర్మాణం కోసం స్థలం అడిగితే ఆనాటి కసాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లా ముదిగొండలో ఏడుగురు పేదలను పొట్టన పెట్టుకుందన్నారు. నేటి పాలకులు కూడా పేదలకు జానెడు జాగా ఇవ్వకపోగా ప్రజలను అనేక భ్రమలకు గురి చేసి వారి జీవితాలతో ఆటలాడుకుంటోందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల సాగు భూమి ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు కావస్తున్నా నేటికీ ఇవ్వలేదన్నారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, జిల్లా కమిటీ సభ్యులు మట్టిపెల్లి సైదులు, కోట గోపి, దండ వెంకట్ రెడ్డి, వేల్పుల వెంకన్న, చెరుకు ఏకలక్ష్మి, నాయకులు బచ్చలకూరి రాంబాబు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పందిరి సత్య నారాయణరెడ్డి, గుర్రం గోపాల్ రెడ్డి ,చిన్నపంగ నరసయ్య, యాతాకుల ప్రవీణ్, దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.