Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నవతెలంగాణ-మోత్కూరు
మున్సిపాలిటీకి ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న నిధులను సద్వినియోగం చేసుకుని అభివద్ధి పనులను వేగవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ సాధారణ సమావేశం చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివద్ధి (టీయూఎఫ్ఐడీసీ) కింద మున్సిపాలిటీకి రూ.7.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆ నిధులతో పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, మీడియం లైటింగ్, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కేంద్రంలో వర్షం వస్తే భారీగా వరద నీరు నిలుస్తున్న ఎస్బీఐ బ్యాంక్ వద్ద రూ.15 లక్షలతో కల్వర్టు, రూ.20 లక్షలతో మురుగు కాల్వలు నిర్మించాలని, మున్సిపల్ విలీన గ్రామాలైన కొండగడప, బుజిలాపురంలో శ్మశాన వాటికల అభివద్ధికి రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షలు, కొండగడపలో అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులను పూర్తి చేసేందుకు సీడీపీ నిధులు రూ.5 లక్షలు, బాలుర గురుకుల పాఠశాల దారిలో సీసీ రోడ్డుకు రూ.10 లక్షలు, సుందరయ్య కాలనీలో మురుగు కాల్వల నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు కేటాయించాలని సూచించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మెన్ బి.వెంకటయ్య, కమిషనర్ షేక్ మహమూద్, మేనేజర్ జాలిగం ప్రభాకర్, టీపీవో వీరస్వామి, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ వెంకటేష్, ఆర్అండ్బీ డీఈ షహనాజ్, ట్రాన్స్కో ఏఈ మచ్చేందర్, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, కారుపోతుల శిరీష, లెంకల సుజాత, ఎర్రవెల్లి మల్లమ్మ, మలిపెద్ది రజిత, వనం స్వామి, దబ్బెటి విజయ, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, గుర్రం కవిత, కూరెళ్ల కుమారస్వామి పాల్గొన్నారు.