Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
నవతెలంగాణ-మునగాల
పేజ ప్రజల సంక్షమమే ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో లబ్దిదారులకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎలకాబిందు నరేందర్రెడ్డి, జెడ్పీటీసీ నల్లపాటి ప్రమీలశ్రీనివాస్, తహసీల్దార్ గుగులోత్ కృష్ణనాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తొగరు రమేష్, మునగాల, తాడువాయి, ఆకుపాముల సింగిల్ విండో చైర్మెన్లు కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు, వల్లపురెడ్డి రామిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బుచ్చి పాపయ్య, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.