Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లాకు జీవన ప్రదాయినిగా ఉన్న శ్రీశైలం సొరంగమార్గం పూర్తి చేసేందుకు రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి డిిమాండ్ చేశారు.బుధవారం పార్టీ నల్లగొండ మండల ఏడో మహాసభ స్థానిక అశోక ఫంక్షన్హాల్లో నలపరాజు సైదులు, కొండ అనురాధా, పోలే సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ అందించడంలో విఫలమైందని విమర్శించారు.కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ పెద్దలకు దేశాన్ని దోపిడీ చేసి పెట్టిందని విమర్శించారు.ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, బ్యాంకులు, ఎల్ఐసీ, ఎయిర్‌లైన్స్ వంటి అనేక రంగాలను అమ్మిందని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు,నిధులు, నియామకాలని అధికారంలోకొచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.నల్లగొండ జిల్లాలో శ్రీశైలంసొరంగమార్గం పనులు పూర్తి చేయలేదని, వరదకాలువు ఏండ్ల తరబడిగా పూర్తి చేయలేదన్నారు.బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకూడా పూర్తి చేయకుండా రాజకీయాలు చేస్తుండడం దారుణమన్నారు.రైతులకిచ్చే సబ్సిడీలను రద్దు చేసిందన్నారు.మహాసభ ఎస్సెల్బీసీ సొరంగ మార్గానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు బాణాల సత్తిరెడ్డి జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, పట్టణ కార్యదర్శి ఎండి.సలీం, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్‌హాషం, పుచ్చకాయల నర్సిరెడ్డి, సైదులు, దొండకృష్ణారెడ్డి, జిల్లా అంజయ్య, కొండ వెంకన్న, చిలుకరాజు భిక్షం, బత్తుల బక్కయ్య, మంగదుడ్ల కృష్ణయ్య, బొల్లు రవీందర్, గోలి వెంకటమ్మ, నీరుడు వెంకటమ్మ, తంతెనపల్లి సైదమ్మ, మానుపాటి యల్లయ్య, కుడుతాల భూపాల్ పాల్గొన్నారు