Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
ఉమ్మడి నల్లగొండ జిల్లా వార్త దినపత్రిక బ్యూరో పోతుగంటి వెంకటేశ్వర్లు (44) బుధవారం మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. మండలంలోని మంగాపురం గ్రామానికి చెందిన పోతుగంటి వెంకటేశ్వర్లు ఊపిరితిత్తుల శ్వాససంబంధ సమస్యలతో బాధపడుతూ హుజూర్‌నగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. మంగళవారం రాత్రి తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యతో బాధ పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు
వెంకటేశ్వర్లు మృతి పట్ల ప్రెస్‌క్లబ్ సంతాపం
పోతుగంటి వెంకటేశ్వర్లు మృతి పట్ల స్థానిక ప్రెస్‌క్లబ్ సభ్యులు సంతాపం ప్రకటించారు. సంతాపం తెలిపిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండ సైదులుగౌడ్, సీనియర్ రిపోర్టర్ ముచ్చర్ల గోపాలకృష్ణ, మేకపోతుల వెంకటేశ్వర్లు, కోటి, లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కడారి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రావుల వెంకన్న, కార్యదర్శి వెంకటేష్, చాగంటి వీరయ్య, నరేష్, జగదీష్, జోషు ఉన్నారు. అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ పెండెం శ్రీనివాస్ గౌడ్ బుధవారం పోతుగంటి వెంకటేశ్వర్లు మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.