Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
కార్పొరేట్, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ ప్రజలను పట్టించుకోని ప్రధాని మోడీ వైఖరికి నిరసనగా ఆగస్టు ఒకటి నుంచి నిర్వహించనున్న ఆందోళనలను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి కోరారు. 'క్విట్ ఇండియా స్ఫూర్తితో సేవ్ ఇండియా' అనే అంశంపై బుధవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నర్సింహారెడ్డి భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీల లాభాలు పెంచేందుకు కేంద్రంలోని మోడీ ప్రభ్వుం పార్లమెంటు సాక్షిగా చట్టాలను మారుస్తున్నారని విమర్శించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవత్సరం నుంచి ఢిల్లీలో పోరాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కరోనా కాలంలో పేదలు మరింత పేదలుగా మారగా కార్పొరేట్ శక్తుల ఆస్తులు రూ.10 రెట్లు పెరిగాయని అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తోన్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ఈ నెల 29 నుంచి మండల స్థాయిలో, ఆగస్టు 2 నుంచి గ్రామ స్థాయిలో సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు, రైతు సంఘం నాయకులు గుర్రం గోపాల్‌రెడ్డి, పందిరి సత్యనారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.