Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దమ్ముంటే అరెస్టులు చేయకుండా సభలు పెట్టండి
- విలేకర్లతో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్
నవతెలంగాణ-నల్లగొండ
టీఆర్ఎస్ అనుసంధానంలో నడుస్తున్న పోలీసు జులూం నశించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శంకర్‌నాయక్ అన్నారు. మంగళవారం అర్ధరాత్రి అక్రమ అరెస్టు అనంతరం విడుదలైన సందర్భంగా బుధ వారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఆహార భద్రత కార్డు పంపిణీలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డిని నిండు సభలో నిలదీసినందుకు జిల్లాలో కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వం అర్ధరాత్రివేళల్లో అక్రమంగా అరెస్టు చేస్తుందని ఆరోపిం చారు.మంత్రికి దమ్ముధైర్యం ఉంటే కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేయకుండా మునుగోడు నియోజకవర్గంలో సభను ఏర్పాటు చేసుకోవాలని సవాల్ విసిరారు. మునుగోడు మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ పికెటింగ్‌తో ఆహారభద్రతకార్డులను పంపిణీ చేయడం మంత్రి పిరికి చర్య అన్నారు.పోలీస్ వ్యవస్థ ప్రతిపక్ష నాయకులను కూడా సమా నంగా చూడాలన్నారు.గతంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రతిపక్ష నాయకులకు స్వేచ్ఛ ఉండేదని కెేసీఆర్ నాయకత్వం స్వేచ్ఛ కనుమరుగైంద న్నారు.అనంతరం కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా గడియారం సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్దె సుమన్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కుంభం శ్రీనివాస్‌రెడ్డి, సైదిరెడ్డి పాల్గొన్నారు.