Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- ప్రాజెక్టుల సందర్శనలో సీపీఐ బృందం డిమాండ్
నవతెలంగాణ-దేవరకొండ
కష్ణాజలాలను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, పెండింగ్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం సీపీఐ రాష్ట్ర ప్రతినిధి బందం కష్ణాజలాల ఆధారిత ఎస్సెల్బీసీ సొరంగమార్గం-1, నక్కలగండి రిజర్వాయర్ పనులను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించింది.పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుంది.నీటి లభ్యత, ఆయకట్టు పారుదల, నిధుల కేటాయింపు, తదితర వివరాలు అడిగి తెలుసుకుంది.అంతకుముందు చందంపేట మండలంలో 7.25 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేపడుతున్న నక్కలగండి రిజర్వాయర్ పనులను పరిశీలించింది.జిల్లా సరిహద్దులోని శ్రీశైలం సొరంగమార్గం టన్నెల్-1 పనులను కూడా పరిశీలించింది.అనంతరం ఆయన మాట్లాడుతూ నక్కలగండి ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించాలన్నారు.90 శాతం పనులు పూర్తయినప్పటికీ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి, ముంపునకు గురవుతున్న వారికి ఇంకా పరిహారం చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.రిజర్వాయర్ సమీపంలోని మోత్యాతండాను పునరావాస కేంద్రంగా ప్రకటించాలన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి వెంటనే రూ.200 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఎస్సెల్బీసీ సొరంగం 16 ఏండ్లు గడిచినప్పటికీ ఇంకా పది కిలోమీటర్లు తవ్వాల్సి ఉందన్నారు.సొరంగం ద్వారా నీళ్లు వచ్చిన ప్రాజెక్టుకు నామమాత్రంగా కాకుండా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన దష్టి ఎస్సెల్బీసీ సొరంగంపై పెట్టాలని, నక్కలగండి రిజర్వాయర్ నుంచి డిండి లిఫ్టు చేపట్టి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరందించాలని కోరారు.కష్ణాజలాల సాధన కోసం రాష్ట్రంలో కలిసొచ్చే పార్టీలతో తాము పని చేసి పోరాటం చేస్తామన్నారు.ఈ బందంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యా పద్మ, ప్రజాపక్షం ఎడిటర్ కె.శ్రీనివాసరెడ్డి, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలనర్సింహ, హేమంతరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెమ్మికంటి సత్యం, పల్లా దేవేందర్‌రెడ్డి, తూము బుచ్చిరెడ్డి, మైనొద్దీన్, మాజీ ఎంపీపీ బొడ్డుపల్లి వెంకటరమణ, వల్లమల్ల ఆంజనేయులు పాల్గొన్నారు.
ఏడాదిలోపు ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే ఉద్యమిస్తాం
నార్కట్‌పల్లి : కష్ణ ఆధారిత ప్రాజెక్టులన్నింటినీ ఏడాది లోపు పూర్తి చేయకపోతే ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం కష్ణ ఆధారిత ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మండలపరిధిలోని బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టును ఆ పార్టీ రాష్ట్రబృందం సందర్శించింది.ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులతో ప్రాజెక్టు నిర్మాణం ప్రస్తుత పరిస్థితి తీరుతెన్నులపై అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పంప్ హౌస్, రిజర్వాయర్లను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కష్ణానది ఆధారిత ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసే విధంగా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదంతో ఈ ప్రాజెక్టులకు ప్రమాదం పొంచి ఉందన్నారు.దీనిని పూర్తి చేయకపోతే నల్లగొండ,మహబూబ్‌నగర్ జిల్లాలు ఎడారిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కష్ణా ఆధారిత ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ.500 కోట్లు కేటాయిస్తే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు పూర్తవుతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, సంకినేని సాంబశివరావు,సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్‌రెడ్డి, రైతు సంఘం నాయకురాలు పశ్య పద్మ, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు లోడంగి శ్రవణ్‌కుమార్, మండల కార్యదర్శి పెండ్యాల శంకర్, నాయకులు వెంపటి శ్రీనివాస్, అక్బర్, ప్రాజెక్టు అధికారి బుచ్చిరెడ్డి పాల్గొన్నారు..