Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య
నవతెలంగాణ-చింతపల్లి
వ్యవసాయ కార్మికులను అదుకోవడం కోసం రైతుబంధు మాదిరిగా కూలీబంధు పథకం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య డిమాండ్ చేశారు.బుధవారం మండలంలోని ఇంజమూర్ గ్రామ సీపీఐ(ఎం) మహాసభ నిమ్మసాయికుమార్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతులను అనుకోవడం కోసం రైతుబంధు పథకం తేవడం హర్షంచదగిన విషయమే కానీ భూస్వాములకు, పెట్టుబడిదారులకు కాకుండా పదెకరాల లోపు రైతులకు కేరళ ప్రభుత్వం తరహా ఎకరానికి రూ.20 వేలు, అలాగే మద్దతు ధర సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో రైతులకు ఇస్తున్నట్టు వ్యవసాయ కార్మికులందరికి కూలీబంధు పథకాన్ని ప్రారంభించి నిరుపేద కూలీల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించే పాలకులు ప్రజల జీవితాలను కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల లక్షలాది ప్రాణాలు కరోనా కారణంగా పాలకుల అశ్రద్ధ వలన గాలిలో కలిసి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఉపాధిహమీచట్టంలో పని చేసే ఎస్సీ, ఎస్టీ కూలీలకు సబ్‌ప్లాన్ నిధుల ద్వారా వేతనాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ పార్టీ కార్యదర్శిగా పోలె యాదయ్య, సహాయకార్యదర్శిగా నిమ్మ సాయికుమార్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ మహాసభలో మండల కార్యదర్శి ఉడుగుండ్ల రాములు, మండల కమిటీ సభ్యులు పోలె యాదయ్య, కడారిబాలయ్య, అరెకంటి పెద్దయ్య, పోలెజంగయ్య, అంజనేయులు, ముత్తయ్య, సత్తయ్య, మహబూబ్ పాల్గొన్నారు.