Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు నుంచి కొత్త వారికి రేషన్
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కొత్తగా మంజూరైన ఆహార భద్రత కార్డుల పంపిణీని ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కొత్తగా ఆహార భద్రత కార్డులు పొందిన వారికి ఆగస్టు నుంచి రేషన్ అందించనున్నట్టు వెల్లడించారు. బుధవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో పలు మండలాలకు చెందిన లబ్దిదారులకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజల ఆకలి తీర్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 24 గంటల నిరంతర విద్యుత్, రైతుబందు, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ వైస్ చైర్మెన్ వెంకట నారాయణగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, అర్డివో రాజేంద్రకుమార్, డీఎస్వో విజయలక్ష్మి, డీఎం రాంపతినాయక్, పలువురు ఎంపీపీలు, తహశీల్దార్లు వెంకన్న, రంగారావు, సుదర్శన్‌రెడ్డి, సర్పంచులు, లబ్దిదారులు పాల్గొన్నారు.