Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డు కిరణ్ అన్నారు .గురువారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యకర్తల విస్తత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రాజ్యాధికార సాధన కోసం కంకణబద్ధులు కావాలన్నారు. ఆగస్టు 8న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ .ప్రవీణ్‌కుమార్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో జరిగే భారీ బహిరంగ సభకు భారీ జన సమీకరణ కోసం కార్యకర్తలు పెద్ద ఎత్తున కషి చేయాలన్నారు .పార్టీ జిల్లా కార్యదర్శి వంటె పాక యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మారయ్య , కాషాయ, తదితరులు పాల్గొన్నారు .
బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాడాలి
మోత్కూరు: బహుజనులు కేవలం ఓటు బ్యాంక్ గానే ఉండకుండా రాజ్యాధికారం సాధించే దిశగా పోరాడాలని బీఎస్పీ మండల అధ్యక్షుడు బుశిపాక నాగరాజు అన్నారు. గురువారం మోత్కూరులో బీఎస్సీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 85శాతం ఉన్న బహుజనులుఎలాంటి అధికారం లేకుండా అభివద్ధికి, విద్య, ఉద్యోగాలకు, ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో కేవలం 15శాతం ఉన్న అగ్రవర్ణాల చేతిలో అధికారం ఉంటుందని, అణిచివేతకు గురి చేస్తూ రాజ్యాన్ని ఏలుతున్నారన్నారు. డబ్బు కోసం అమ్ముడుపోని సమాజం కావాలని, కాన్షిరాం బాటలో పయనించి రాజ్యాధికారం దిశగా బహుజనులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శులు బుశిపాక నాగరాజు, చిరగూడూర్ ప్రతాప్, పట్టణ, మున్సిపల్ అధ్యక్షులు గణపాక నవీన్, మెంట స్వామి,యాదగిరి, నల్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు.