Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ దళిత వ్యతిరేకి అని నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ బొర్ర సుధాకర్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ లో టీఆర్ఎస్ దళిత విభాగం ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో స్వాతంత్య్ర అనంతరం పెద్ద ఎత్తున దళిత కుటుంబాల ఆర్ధిక బలోపేతానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అవహేళన చేసి ఈటెల ఆయన బావమరిది మధుసూదన్ రెడ్డి మాట్లాడారన్నారు. ఈ కార్యక్రమంలో , నల్గొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సీనియర్ నాయకులు, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, బకరం వెంకన్న , జిల్లా శంకర్,దొడ్డి రమేష్, మాతంగి అమర్ , కొత్తపల్లి పిచ్చయ్య ,బొజ్జ వెంకన్న, బేరి నాగరాజు విమలమ్మ, పెరిక ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు
నకిరేకల్ : బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ అండ్ కో దళితుల మనోభావాలు గాయపడే విధంగా వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ సెంటర్లో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈటల రాజేందర్ ఆయన బావమరిది పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.