Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మునుగోడు
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులను కాలరాస్తూ నిరసన తెలిపే కాంగ్రెస్ నాయకులపై గుండాల టీఆర్ఎస్ నాయకులు దాడిని నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు పాల్వాయి జూనియర్ గోవర్థన్రెడ్డ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డిరాజగోపాల్రెడ్డి సవాల్ విసరడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు భీమనపల్లి సైదులు , పోలగోని విజయలక్ష్మి సైదులు , సర్పంచులు జాల వెంకన్న యాదవ్, వంటేపాక జగన్ , తాటికొండ సంతోష సైదులు , నందిపాటి రాధా రమేష్, జక్కల శీను యాదవ్ , మాజీ సర్పంచ్ పాలకురి యాదయ్య , బోయపర్తి లింగయ్య, ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాగర లింగస్వామి మేకల ప్రమోద్ రెడ్డి వివిధ గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.
చండూర్:కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టు లను ఖండిస్తూ గురువారం స్థానిక చౌరస్తా లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు పల్లెవెంకన్న మాట్లాడుతూ అక్రమ అరెస్టు వల్ల ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మెన్ తోకల చంద్రకళ వెంకన్న , టౌన్ పార్టీ అధ్యక్షుడు దోటి వెంకటేష్ ,కౌన్సిల్ మంచుకొండ కీర్తి సంజరు , కొంరెడ్డి యాదయ్య, కో ఆప్షన్ రవిరాల నగేష్ , వహిద్ , బ్రాహ్మం, జిల్లా ప్రాధన కార్యదర్శులు అనంత చంద్ర శేఖర్ గౌడ్ , గుండు వెంకట్ గౌడ్ , ఇరిగిరాజు, పన్నలా లింగయ్య , ఓబీసీ కల్లెట్ల మరయ్య, పుల్లయ్య, మాజీ మార్కెట్ ఛైర్మెన్ బురకల బిక్షం ,సర్పంచులు సపిడి రాములు ,మేకల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.