Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేతిలో మైకు ఎవరు గుంజుకున్నదన్నది ప్రపంచమే చూసింది
- పూటకో మాట కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అలవాటు
- ఆటలు సాగక పోవడం వల్లే దౌర్జన్యం
- జిల్లా అభివృద్ధిపై కేసీఆర్ 26 సార్లు సమీక్షించారు
- విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట
'కోమటిరెడ్డి బ్రదర్స్వి చిల్లర మాటలు.. వెకిలి చేష్టలు. పూటకో మాట మాట్లాడుతూ ప్రజల్లో పలుచనయ్యారన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మొహం చూపలేకనే మైక్ గుంజుకొనే డ్రామాకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెర లేపారు. ఎంతసేపటికీ మీడియాలో సెంట్రలైజేషన్గా ఉండాలన్నదే అన్నదమ్ముల పరితపన' అని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యావత్ ప్రపంచం విస్తూపోయేలా మంత్రి చేతుల్లోంచి మైక్ లాక్కుంది కాకుండా ప్రభుత్వం దౌర్జన్యం చేసిందంటూ ఆరోపించడం రాజగోపాల్‌రెడ్డికి సరికాదన్నారు. స్వప్రయోజనాల కోసం పదవులను అడ్డం పెట్టుకుని కాంట్రాక్టులు చేసుకుంటూ ఇంత కాలం బతికారని, ఇక్కడ అది సాగక పోవడంతో వల్లే కొంత మంది లంపియన్ గ్యాంగ్‌లతో ఈ తరహా డ్రామాలకు తెరలేపడం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రివాజుగా మారిందన్నారు. వారి దివాలకోరు రాజకీయాలకు చౌటుప్పల్ ఉదంతం నిదర్శనమని వివరించారు. ఏడేండ్లుగా రాజకీయాలకతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. సీఎం కేసీఆర్ సైతం జిల్లా అభివృద్ధిపై 26 సార్లు సమీక్షలు నిర్వహించినట్టు చెప్పారు.