Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎన్.సుగంధి అన్నారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారం, వారు పాటించాల్సిన జాగ్రత్తల గురించి గురువారం మండలంలోని గడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యంతో పాటు, బిడ్డ పెరుగుదలకూ తోడ్పడుతుందన్నారు. దైనందిక ఆహారంలో కరివేపాకు, మునగాకు తప్పకుండా తీసుకోవాలని, చిరుధాన్యాలైన రాగులు, సజ్జలు, జొన్నలు తదితర వాటిని తీసుకోవడం వల్ల ఎముకలు గట్టి పడతాయని తెలిపారు. ఈ సమావేశంలో అంగన్వాడీ టీచర్ షేక్ బషీరాబేగం, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.