Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 105 ఉత్తర్వుల నిబంధనలకు లేఅవుట్ లు అనుమతులు జారీ చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి కోరారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కన్వీనర్ దీపక్ తివారి అధ్యక్షతన ఆయన ఛాంబర్లో జిల్లాస్థాయి లేఅవుట్ ఆమోదిత కమిటీ సమావేశం నిర్వహించి ప్రభుత్వ మార్గదర్శకాలపై చర్చించారు. టీఎస్‌బీపాస్ ప్రకారం నిబంధనల మేరకు నిర్మాణాలకు అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నోటీసులు జారీ చేసి అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. నిర్మాణాల విషయంలో 21 రోజులలోగా నిబంధనలు పరిశీలించి అనుమతులు జారీ చేయాలని సూచించారు. జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ కి జిల్లా కలెక్టర్ చైర్మెన్ గాను, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు ఇ ఇ లు, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి సభ్యులు గాను జిల్లా అదనపు (రెవిన్యూ) కలెక్టర్ నామినేటెడ్ సభ్యులుగా పరిశీలించి, లే అవుట్ నిబంధనలు పరిశీలించి ఆమోదిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ఇఇ శంకరయ్య, ఇరిగేషన్ శాఖ ఇ ఇ రుక్సనా, టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి లక్ష్మీనరసయ్య, పంచాయతీ రాజ్ ఇఇ జోగ్గారెడ్డి, ఇతర టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు భువనగిరి తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, సెక్షన్ పర్యవేక్షకులు రవికుమార్, పైర్, పోలీస్ అధికారులు , మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.