Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అద్యక్షులు మాటూరి బాలరాజు గౌడ్
నవతెలంగాణ -రామన్నపేట
సర్థార్ సర్వాయి పాపన్న జయంతి సందర్బంగా గీత కార్మికోద్యమ యోధుల యాది సభలను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు గౌడ్ పిలుపునిచ్చారు. రామన్నపేట మండల కమిటీ సమావేశం నాయకులు పులి బిక్షం అధ్యక్షతన స్థానిక కేజే భవన్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న 371 వర్థంతి సందర్భంగా ఆగస్టు 2 నుండి 18 వరకు యోధుల యాది సభలను నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో గీత కార్మిక ఉద్యమంలో పాల్గొని గీత కార్మిక హక్కుల కోసం పని చేసి అమరులైన సర్దార్ సర్వాయి పాపన్న, ధర్మబిక్షం, యస్,అర్ దాట్ల, తొట్ల మల్సూర్, దేశిని చిన మల్లయ్య, బైరు మల్లయ్య, సూదగాని ఎట్టయ్య, మొరిగాడి యాదగిరి, మునుకుంట్ల ఎల్లయ్య లాంటి అమర వీరుల స్ఫూర్తి తో గీత కార్మిక హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమం కోసం 5 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సొసైటీలకు భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటుకు కషి చేయాలని డిమాండ్ చేశారు.జిల్లాలోని నందనంలో తాటి ఉత్పత్తుల పరిశ్రమ వెంటనే ఏర్పాటు చేయాలని, మెడికల్ బోర్డు నిబంధనలు తొలగించాలని, అర్హులైన వారందరికీ సభ్యత్వం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సభ్యులందరికీ ద్విచక్ర వాహనం ఇవ్వాలని ఆయన కోరారు. గీత కార్మికోద్యమ యోధుల యాదిలో కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించాలని పిలుపిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బావండ్లపల్లి బాలరాజు, మండల నాయకులు తోలుపునూరి శ్రీనివాస్, కూనూరు మల్లేశం.మునుకుంట్ల లెనిన్, పొలగోని స్వామి, చెరుకు సాయి, గుండాల బిక్షం తదితరులు పాల్గొన్నారు.