Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
దళితుల కోసం దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ప్రవేశపెట్టని అనేక సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణశ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్‌రెడ్డి దళితులను అసభ్య పదజాలంతో సంబోధించడాన్ని నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. కేవలం ఎన్నికల సమయంలోనే దళితులు గుర్తుకొస్తారని అనడంలో అర్థం లేదన్నారు. దళిత బందు పథకం మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలోనే ఆవిష్కతమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హస్సేన్, మున్సిపల్ కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్, టీఆర్ఎస్ నాయకులు చిప్పలపల్లి జయశంకర్, చింతలపాటి మధు, గాజుల రాంబాయమ్మ, కత్తి వెంకన్న, బోలెద్దూ వినరు, దేవయ్య పాల్గొన్నారు.
మద్దిరాల : దళితులను దూషించిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘం నాయకులు గోల్కొండ మల్లేష్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఈటల రాజేందర్ బంధువు మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం దళితబంధు ప్రకటించడంతో ఓర్వలేక ఈటల రాజేందర్, ఆయన కుటుంబం ఇలాంటి దళిత వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రాంపాక నాగరాజు, గోల్కొండ రవి, రాంపాక వెంకన్న, రాంపాక రవి, బత్తిని గిరి, రాంపాక మురళి, రాంపాక సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి : దళితులను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని దళిత సంఘం నాయకులు హెచ్చరించారు. గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ బావమరిది కొండవీటి మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మధుసూదన్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మల్లెపాక వెంకన్న, బొంకురి బిక్షం, బొజ్జ యాదగిరి, బొంకురి సురేష్, మధుసూదన్, నాగయ్య, శ్రీను, సుందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.