Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
కోవిడ్ బాధితులకు సహాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నాగు నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం కాసా జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితుల కోసం రూ.70 వేల విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను ఆ సంస్థ అధికారి కరుణాకరన్ అందజేశారు. ఈ సందర్భంగా నాగునాయక్ మాట్లాడుతూ కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాసా స్వచ్ఛంద సంస్థ అధికారి ప్రేమ్ కుమార్, ఫెసిలిటేటర్ శ్రీనివాస్, హెచ్ఈవో సముద్రాల సూరి, స్టాఫ్ నర్స్ సుజాత, సీనియర్ అసిస్టెంట్ సామ్సన్, హెల్త్ అసిస్టెంట్లు గాజుల సోమయ్య, నర్సింహాచారి, రజిత, ఉపేంద్ర, స్వప్న, రాజేష్, దేవేంద్ర పాల్గొన్నారు.