Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కార్డు అందజేస్తామని కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో గురువారం మండలానికి మంజూరైన 219 రేషన్‌కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్కమల్ల జ్యోతి, జెడ్పీటీసీ రాపోలు నర్సయ్య, మున్సిపల్ వైస్ చెర్మెన్ చల్లా శ్రీలత రెడ్డి, మార్కెట్ చైర్మెన్ ఇంజమూరి యశోదరాములు, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, తహసీల్దార్ సరిత, పెంచికల్ దిన్నె పీఏసీఎస్ చైర్మెన్ శాఖమూరి శ్రీకాంత్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చింతకుంట్ల సోమిరెడ్డి, ఎంపీటీసీ రాజేష్, కౌన్సిలర్లు భాష, షానవాజ్, సర్పంచ్ పల్లెపంగు నాగరాజు, రోజా, నాగునాయక్ తదితరులు పాల్గొన్నారు.