Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముమ్మరంగా ఆహార భద్రత కార్డులు పంపిణీ
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట, పెన్‌పహాడ్ మండలాలకు చెందిన లబ్దిదారులకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయాలకతీతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పేదల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు లేవని స్పష్టం చేశారు. రైతులకు నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రుణ మాఫీ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు, ఎంపీపీలు బీరవోలు రవీందర్‌రెడ్డి, నెమ్మది బిక్షం, జెడ్పీటీసీలు జీడి బిక్షం, అనిత అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఉప్పల లలితాఆనంద్, డీఎస్వో విజయలక్ష్మి, తహశీల్దార్లు వెంకన్న, శేషగిరి రావు, సర్పంచులు, లబ్దిదారులు పాల్గొన్నారు.