Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ - నార్కట్‌పల్లి
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని శబరి గార్డెన్స్‌లో మండల వ్యాప్తంగా మంజూరైన 419 రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేసి మాట్లాడారు. సంక్షేమాన్ని ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉంచిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. వ్యవసాయ రంగానికి, విద్యుత్, సంక్షేమ పథకాలు అమల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. రేషన్ కార్డులు మంజూరు, జారీ చేసే విషయంలో ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, తహసీల్దార్ పొడపంగి రాధా, వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరిగౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ కసిరెడ్డి మధుసూధన్‌రెడ్డి, సర్పంచులు దూదిమెట్ల స్రవంతి, మేడి పుష్పలతశంకర్, దుబ్బ మధు, కొత్త నర్సింహా, గోసుల భద్రాచలం, గంట్ల నర్సిరెడ్డి, బద్దం వరలక్ష్మిరాంరెడ్డి, ఎంపీటీసీలు దుబ్బాక పావనీశ్రీధర్, శ్రీరామోజు జయలక్ష్మి వెంకటేశ్వర్లు, చింత దేవమ్మ, బొక్క కనకమ్మ భూపాల్‌రెడ్డి, కనుకు అంజయ్య, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, నాయకులు ఈద నర్సింహా, ఎం.నర్సింహా, దోసపాటి విష్ణుమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ మురళీమోహన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మంగమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.