Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
నవతెలంగాణ-చింతపల్లి
రాష్ట్రంలో పేదలు ఆకలితో అలమటించొద్దన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని సాయి సుమంగళి గార్డెన్లో పలువురు లబ్దిదారులకు రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. పేదలకు సబ్సిడీపై నిత్యావసరాలు అందించేందుకే తెల్లరేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి, ఎంపీపీ కొండూరు భవాణి పవన్ కుమార్, తహాశీల్దార్ విశాలాక్షి, ఎంపీడీఓ రాజు, స్థానిక సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి, స్థానిక ఎంపీటీసీ, ఎల్లంకి వరలక్ష్మి అశోక్, నల్లవెల్లి సదానందం, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ వెంకటయ్య, మండలాధ్యక్షుడు నట్వ గిరిధర్, ప్రధాన కార్యదర్శి దొంతం చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గున్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల మండల ఫోరం ప్రధాన కార్యదర్శి వింజమూరి రవి పాల్గొన్నారు.
చందంపేట:రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం నేరడుగొమ్ము మండల కేంద్రంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసమే రైతు వేదికలను నిర్మించినట్టు తెలిపారు. రైతుబంధు, రైతు బీమా పథకం దేశానికే ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, ఎంపీపీ బాణావత్ పద్మహన్మ, జెడ్పీటీసీ కేతావత్ బాలు, పీఏసీఎస్ చైర్మెన్ ముక్కమల్ల బాలయ్య, వైస్ ఎంపీపీ అరేకంటి ముత్యాలమ్మరాములు, సర్పంచ్ పల్స బాలామణివెంకటయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లోకసాని తిరపతయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాడిత్యబాలు, ఎంపీడీవో ఝాన్సీలక్ష్మీ, బషీర్, దూడ బావోజి, బైరెడ్డి కొండల్‌రెడ్డి, బొడ్డుపల్లికృష్ణ, ముక్కమల్ల సాయన్న పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మీని సద్వినియోగం చేసుకోవాలి
కల్యాణలక్ష్మీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం నేరడుగొమ్ములోని తహసీల్దార్ కార్యాలయంలో లబ్దిదారు లకు చెక్కులు పంపిణీ చేశారు.