Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
మండల వ్యాప్తంగా రేషన్ కార్డులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు ప్రజాప్రతినిధులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వారి నిర్లక్ష్యం వల్ల పేద మధ్య తరగతి ప్రజలు అన్యాయానికి గురయ్యారని కాంగ్రెస్, సీపీఐ(ఎం) నాయకులు పాక మల్లేష్, గుణ గంటి రమేష్, గడ్డం వెంకటేష్ అన్నారు. గురువారం సానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండలాల్లో వందలకుపైగా రేషన్ కార్డులు మంజూరైన పోచంపల్లి మండల వ్యాప్తంగా 33 రేషన్ కార్డులు మంజూరు చేయడం అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తుందన్నారు. వీరు నిర్లక్ష్యం వల్ల మండల వ్యాప్తంగా ఉన్న పేద మధ్యతరగతి ప్రజలు రేషన్ బియ్యానికి నోచుకోక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అంచనావేసి అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గునుగంటి వెంకటేష్, కార్యదర్శి కుక్క కుమార్, సీపీఐ(ఎం) పట్టణ నాయకులు పగడాల శివ ,మండల కమిటీి సభ్యులు మంచాల మధు, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మక్తాల నర్సింహా ,జినుకల కుమార్, దుబ్బాక జగన్, రామసాని అనిల్ రెడ్డి, వంగూరి పాండు ,తదితరులు పాల్గొన్నారు.