Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ -వలిగొండ
వేముల మహేందర్ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు విస్తతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ పిలుపునిచ్చారు. శుక్రవారం పులిగిల్ల గ్రామంలో ఆ పార్టీ గ్రామశాఖ పదవ మహాసభ కళ్లెం సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండలాన్ని ఉద్యమ కేంద్రంగా అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఉపాధి కూలీలు, వ్యవసాయకూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం వేముల మహేందర్ పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొందరికే రేషన్కార్డులివ్వడం సమంజసంగా లేదన్నారు. దళిత బంధు జిల్లాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన శాఖ కార్యదర్శిగా బుగ్గ చంద్రమౌళి మారబోయిన నరసింహను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మద్దెల రాజయ్య, జిల్లా కమిటీ సభ్యులు స్వామి, తుర్కపల్లి సురేందర్, కొమ్మి లక్ష్మారెడ్డి ,వాకిటి వీరారెడ్డి, వెంకట్ రెడ్డి, తిరుమల్ రెడ్డి పాల్గొన్నారు.