Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో 80 ఏండ్ల వద్ధురాలు మతి చెందిన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మృతురాలి కూతురు సైదమ్మ తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన రాస మల్ల సైదమ్మ తల్లి పూస బాలమ్మ(80) రెండు రోజులుగా అనారోగ్యానికి గురైంది. వైద్యం సహాయం కోసం శుక్రవారం నారాయణపురం ప్రాథమిక ఆస్పత్రికి వచ్చింది. సిబ్బంది పట్టించుకోకుండా రెండు గంటలకు పైగా ఆరుబయటే ఉంచడం వల్ల వద్ధురాలు మతి చెందినట్లు బాలమ్మ కూతురు సైదమ్మ ఆరోపించారు. శుక్రవారం 11 గంటలకు ఆస్పత్రికి తీసుకురాగా ఒంటిగంటకు కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వచ్చిందని చెప్పారు. అనంతరం ఎట్లాంటి వైద్య సహాయం అందించక పోవడంతో తల్లి మతి చెందింది. రెండు రోజులుగా ఆహారం తీసుకోవడం లేదని వైద్యం అందించాలని వేడుకున్న విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ శాంతి ఈ విషయాన్ని డాక్టర్ కి తెలపకుండా గంటల తరబడి ఆరుబయటే నిలబెట్టడం వల్ల తల్లి మతి చెందింది. స్టాఫ్ నర్స్ పట్టించుకోని వైద్య సహాయం అందించి ఉంటే తన తల్లి బతికి ఉండేదని బోరున విలపించింది. చనిపోయిన తర్వాత వచ్చి పరిశీలించిన డాక్టర్ చౌటుప్పల్ ఏరియాసుపత్రికి తీసుకుపో అని చెప్పడంతో అనుమానం కలిగించింది. వద్ధురాలైన తన తల్లికి జరిగిన సంఘటన మరెవరికీ జరగొద్దని స్టాఫ్ నర్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని సైదమ్మ సత్తయ్య డాక్టరుకు చేతులెత్తి వేడుకుంది.
సీరియస్ నెస్ ఉందని సిబ్బంది గమనించలేదు డాక్టర్ దీప్తి
మతి చెందిన బాలమ్మకు సీరియస్నెస్ ఉన్నట్టు విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ నా దష్టికి తీసుకు రాలేదు. నేను నెలసరి సెక్టార్ మీటింగ్లో ఉన్నందున పేషెంట్ కండిషన్ గమనించలేకపోయాను. అప్పటికే ల్యాబ్ టెక్నీషియన్ ధనలక్ష్మి కరోనా టెస్ట్ చేసింది. నెగిటివ్ వచ్చినట్టు రిపోర్టులు వచ్చాయి. స్టాఫ్ నర్స్ పేషెంట్ కండిషన్ గమనించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు.