Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ జిల్లా సెషన్స్ జడ్జి ఉత్తం ఆనంద్, హైదరాబాద్‌కు చెందిన మహిళా న్యాయవాది రయిజా ఫాతిమా హత్యలను ఖండిస్తూ పలువురు న్యాయవాదులు శుక్రవారం తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ నాళం రాజన్న మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై రోజురోజుకూ దాడులు పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరమని అన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తమ్మినేని హనుమంతరావు, శరత్‌బాబు, గట్ల నరసింహారావు, చింతకుంట్ల రామిరెడ్డి, మహిళా న్యాయవాదులు పద్మ, దుర్గా, హేమలత, పాషా, కోదండపాణి, నాగరాజు, రియాజ్, ఉయ్యాల నర్సయ్య, సీతారామరాజు, దొడ్డ శ్రీధర్, జనార్ధన్‌రావు, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి: జార్ఖండ్ రాష్ట్రంలో అదనపు జిల్లా జడ్జి ఉత్తం ఆనంద్ హత్య కావడం, హైదరాబాదుకు చెందిన ఓ మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురికావడంతో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి మతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండునిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గోదా వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు జీ నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఎస్ జంగారెడ్డి ,సీనియర్ న్యాయవాదులు నాగారం జయ విజయ భాస్కర్ రెడ్డి, లింగారెడ్డి, పాశం శ్రీధర్, జయ, రజిని పాల్గొన్నారు.