Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరి రూరల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేండ్లకాలంలో ప్రజల పై భారాలు మోపి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ విమర్శించారు. గురువారం మండలంలోని నందనంగ్రామంలో ఆ పార్టీ గ్రామశాఖ రెండవ మహాసభ కొండాపురం పౌలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ ,డీజిల్ , నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపిందన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు బెట్టేందుకు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయాన్నికి కరెంట్ బిల్లు పెంచుతున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలందరికీ రూ. 7500 చొప్పున ఆరు నెలలపాటు ఇవ్వాలని ,నిత్యావసర వస్తువులు అందజేయాలని కోేరారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుద్యోగ భతి ,అన్ని రకాల పెన్షన్లు ,దళితులకు 3 ఎకరాల భూమి ఇలా అనేక హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి గ్రామ స్థాయి నుంచే ఆందోళన పోరాటాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వనం రాజు, శాఖ కార్యదర్శి కొండాపురం యాదగిరి, వట్టిపల్లి శివసాయి, కొల్లూరు పోశయ్య, కొండాపురం మల్లయ్య ,కొండాపురం ఆంధ్రయ్య, పొట్ట పెంటయ్య , కె.సాయిలు పాల్గొన్నారు.