Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వంపై రూ.7 వేల కోట్ల అదనపు భారం
- అర్హులు ఆన్లైన్లో నమోదు చేసుకోండి
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-యాదాద్రి
ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాలకూ రేషన్ కార్డులు అవసరమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిందని కొనియాడారు. యాదగిరిగుట్టలో శుక్రవారం స్థానిక ఫంక్షన్ హాల్లో యాదగిరిగుట్ట, రాజాపేటకు చెందిన లబ్దిదారులకు ఆమె రేషన్‌కార్డులు అందజేశారు. అదేవిధంగా కల్యాణలక్ష్మి చెక్కులను కూడా ఈ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంత గడ్డు కాలంలో కూడా ప్రజలకు అండగా ఉండడానికి కేసీఆర్ ఆహారభద్రత కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని కొనియాడారు. 7వేల కోట్ల అదనపు భారం పడుతున్నా కూడా పేదల కడుపు నింపడానికి ఆహార భద్రత కార్డులు పంచి బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట, రాజపేట తహసీల్దార్లు అశోక్ రెడ్డి, మందుల జయమ్మ యాదగిరిగుట్ట, రాజాపేట ఎంపీపీ చీర శ్రీశైలం, గోపగాని బాలమణి యాదగిరి, యాదగిరిగుట్ట, రాజాపేట జెడ్పీటీసీలు తోటకూరి అనురాధ బీరయ్య, చామకూర గోపాల్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుదాహేమేందర్, వైస్ చైర్మెన్ మేడ బోయిన కాటంరాజు, వార్డు కౌన్సిలర్లు ముక్కర్ల మల్లేష్, బూడిద సురేందర్, యాదగిరిగుట్ట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యాదగిరిగుట్ట మండలం ఆయా గ్రామాల సర్పంచులు బైరగాని పుల్లయ్య, ఆరె మల్లేష్, తోటకూరి బీరయ్య, గుడ్ల సరిత మల్లారెడ్డి, రాజాపేట మండలం ఆయా సర్పంచులు ఆడెపు ఈశ్వరమ్మ శ్రీశైలం, గుంటి మధుసూదన్ రెడ్డి, వసుమతి ధనలక్ష్మి విష్ణు, కంచర్ల శ్రీనివాస్ రెడ్డి గాడిపళ్లి శ్రావణ్ కుమార్, మాడవత్ దేవి , ధర్మేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.