Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేరుకే ఆస్పత్రులు
- ఎప్పుడు చూసినా తాళాలు వేసి ఉంటున్న వైనం
నవతెలంగాణ-పెన్పహాడ్
స్థానికంగా ఉండి ప్రజలకు సేవలందించాల్సిన వైద్య సిబ్బంది తమ బాధ్యతను విస్మరిస్తున్నారు. ఎప్పుడు చూసినా అందుబాటులో ఉండక పోవడంతో చికిత్స కోసం వస్తున్న రోగులు ప్రభుత్వ వైద్యానికి నోచడం లేదు. ఫలితంగా వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పశువైద్య, ఆయుర్వేద వైద్య ఆస్పత్రులు పేరుకే ఉన్నట్టు కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం 11:30 నిమిషాలు అయినా ఆయా ఆస్పత్రులకు వైద్యులు గాని సిబ్బంది గాని రాలేదు. కనీసం ఆస్పత్రుల తాళాలు కూడా తీయని పరిస్థితి ఉంది. పలువురు రైతులు, సాధారణ ప్రజలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నిరాశతో వెనుదిరిగి పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్యులు, సిబ్బంది సకాలంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.