Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మంత్రి జగదీశ్‌రెడ్డిపై టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమాభివృద్ధికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుడి భుజంగా ఉండి సూర్యాపేట జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఏకైక మంత్రి జగదీష్‌రెడ్డి అని స్పష్టం చేశారు. పటేల్ రమేశ్‌రెడ్డి తన ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, రాష్ట్ర నాయకులు ఉప్పల ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మెన్ పుట్టా కిషోర్, పెద్దగట్టు చైర్మెన్ కోడి సైదులుయాదవ్, కౌన్సిలర్లు తాహెర్ పాషా, చింతలపాటి భరత్, నాయకులు చిరువెల్లు శభరినాథ్, కుంభం రాజేందర్, పిడమర్తి శంకర్, రఫీ, నెమ్మది కృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.