Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
చదువుకునేందుకు సాయం అందించాలని మండలంలోని జనగాం గ్రామపంచాయతీ పరిధిలోని పుర్లకుంట గ్రామానికి చెందిన పాలిటెక్నిక్‌లో డిప్లమా చదువుతున్న విద్యార్థిని వరకాంతపు రేఖ దాతలను వేడుకుంటున్నది. జనగామ గ్రామ పరిధిలో గల పుర్లకుంట గ్రామానికి చెందిన రేఖ నాలుగు నెలల వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి అయిన వారకాంతపు రాణి, తన కూతురును కూలిపని చేస్తూ చదివిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది .గత రెండేండ్ల నుండి తల్లి రాణికి కాళ్ల నొప్పులు రావడంతో కూలి పని చేయలేక పోతున్నది. దీంతో పాలిటెక్నిక్‌లో డిప్లమా చదువుతున్న విద్యార్థి రేఖ కూలిపని చేస్తూ తల్లికి ఆర్థికంగా సహాయపడుతూ తన చదువులకు కావాల్సిన ఫీజులను వెల్లదీసుకుంటుంది. ఇటీవల తల్లికి కరోనా రావడంతో, రెండేళ్లుగా కరోనా మూలంగా పని దొరకక మరింత ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో పరీక్ష ఫీజులు కట్టలేక కుటుంబాన్ని పోషించలేక చేసేందుకు పని దొరకక రేఖ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తుంది. దాతలు తగినంత చేయూత అందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని తన చదువును కొనసాగించే విధంగా చేయూత అందించాలని వేడుకుంటుంది. మనసున్న దాతలు ఫోన్ నెంబర్ 9550031178కు ఆర్థిక సాయం అందజేయాలని చేతులెత్తి మొక్కుతున్నది.