Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగసంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్న విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9 క్విట్ ఇండియా స్ఫూర్తితో భారతదేశం రక్షణ దినంగా పాటిస్తూ రైతాంగం కార్మిక వర్గం పెద్ద ఎత్తున నిరసనలు చేయాలని జిల్లాకేంద్ర సహకార బ్యాంకు మాజీ వైస్చైర్మెన్ సయ్యద్హాషం, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య కోరారు.సీఐటీయూ రైతు సంఘం, వ్యవసాయ కార్మికసంఘాల ఆధ్వర్యలో జూలై 25 నుండి ఆగస్టు 9 వరకు కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రచార క్యాంపులో భాగంగా శుక్రవారం నల్లగొండ మండలం అనంతారం గ్రామంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు నెలలుగా రైతువ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న రైతాంగానికి మద్దతుగా, కార్మిక వ్యతిరేక కోడ్లను, విద్యుత్ సవరణచట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సేవ్ డెమోక్రసీ, సేవ్ అగ్రికల్చర్, సేవ్ పబ్లిక్ సెక్టార్, మోడీ విధానాలను ప్రతిఘ టించండి అని నిందించారు.ఈ కార్యక్రమంలో రైతులు, కూలీలు ఎల్లయ్య, రాములు, ఇస్తారి, సాయిలు, భద్రయ్య, అంజయ్య, నాగరాజు, రాంబాబు, యాదమ్మ, అండాలు పాల్గొన్నారు.