Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీకాలనీలోని 100 ఇండ్లల్లో కాలిపోయిన టీవీలు, కంప్యూటర్లు, ప్రీజ్లు
- రూ. 25 లక్షల ఆస్తినష్టం
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మండలపరిధిలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామం బీసీకాలనీలో శుక్రవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ సంభవించింది.ఈ ఘటనలో వందగృహాల్లో టీవీలు, కంప్యూటర్లు, ప్రీజ్లు కాలిపోయాయి.తద్వారా రూ.25 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం....అధికారుల తప్పిదంతో విద్యుత్ షార్ట్ సర్కూట్ సంభవించింది.తద్వారా సుమారు 100 ఇండ్లలో టీవీలు, ప్రీజ్లు, కంప్యూటర్లు కాలిపోయాయి.రూ.25 లక్షల ఆస్తినష్టం సంభవిం చింది. ఇరవై రోజుల కింద రోడ్డు ప్రమాదం ద్వారా ప్రయివేట్ కాలేజ్ బస్సు ట్రాన్స్ఫార్మర్ను ఢకొీట్టి ధ్వంసం చేసింది.ఆ రోజు నుండి ఈ రోజు వరకు నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహించడంతో వేరే ట్రాన్స్ఫారంపై అధిక లోడ్ పడి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది.
సర్వే చేయించి నష్టపరిహారం అందించాలి
మండల పరిషత్ ఉపాధ్యక్షులు కల్లూరి యాదగిరిగౌడ్, ఉపసర్పంచ్ వడ్డే భూపాల్‌రెడ్డి
ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు నూతనట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో షార్ట్‌సర్య్కూట్ అయి రూ.25 లక్షల విలువైన టీవీలు, కంప్యూటర్లు, ప్రీజ్లు కాలిపోయాయి.ఉన్నతాధికారులు సర్వే చేయించి బాధితులకు నష్టపరిహారం అందించాలి.
విద్యుత్ అధికారుల తప్పిదం లేదు
ట్రాన్స్‌కో ఏఈ- పాలకుర్తి లక్ష్మయ్య
ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో జరిగిన షార్ట్ సర్క్యూట్‌కు అధికారుల తప్పిదం లేదు.పక్షులు ట్రాన్స్ఫార్మర్పై వాలడంతో ఒక తీగకు మరో తీగ తగిలి షార్ట్‌సర్క్యుట్ అయ్యింది.అధికలోడ్ ప్రభావం ఏమాత్రమూ లేదు.