Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
నకిలీ వైద్యులపై చర్యలు తీసుకోవాలని యూఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ వెంకటేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ పట్టణంలోని నకిలీ వైద్యులుగా చలామణీ అవుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా కొన్ని రోజుల కింద వారిని పరిగణనలోకి తీసుకొని జిల్లా వైద్యాధికారులు సీజ్ చేయడం జరిగిందని, కానీ మరలా యథావిధిగా కాలే కడుపులతో, భరించలేని అనారోగ్యంతో బాధపడుతున్న అమాయక ప్రజల్ని, గిరిజనుల్నిఆసరాగా చేసుకొని వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులుగా అర్హత లేనటువంటి పట్టాలతో వైద్యులమని చలామణీ అవుతూ వారి డబ్బునే ఆసరాగా చేసుకొని పేద ప్రజలను మోసం చేస్తున్నదుస్థితి మళ్లీ నెలకొన్నదని మండిపడ్డారు.శాశ్వత పరిష్కారంగా వాటిపై కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేసే దిశగా జిల్లా వైద్యాధికారుల బందం సందర్శించి ఇలాంటి వాటిని పునరావతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.అదే విధంగా పరారీలోనున్నఅర్హత లేని డాక్టర్ దయానంద్‌పై కేసు పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదని ఆరోపించారు.వినతిపత్రం అందజేసిన వారిలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వంగూరి వెంకటేశ్వర్లు, ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు నేనావత్ కుమార్ నాయక్, యూఎస్ఎఫ్ఐ నాయకులు కలమురి పరిశురాం, సయ్యద్, ఫయాజ్, షోయబ్, ఎన్ఎస్యూఐ నాయకులు ఒసామా, కార్తీక్, కోటేష్, మంగులాల్, చందర్‌సింగ్, షోయబ్‌ఖాన్ ఉన్నారు.