Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ ప్రాంతంలో పార్టీ నిర్మాణం కోసం కషి చేస్తూ తాడిత, పీడిత ప్రజల హక్కుల కోసం నిత్యం పోరాడిన గొప్ప వ్యక్తి గట్టికొప్పుల రాంరెడ్డి అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరజీవి గట్టికొప్పుల రాంరెడ్డి రెండోవర్థంతి కార్యక్రమాన్ని మండలంలోని తడకమళ్ళ గ్రామంలో స్తూపం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గొర్ల ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు.భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో వీరోచితమైన పాత్రలు పోషించి నిజాంకు వ్యతిరేకంగా పేద ప్రజానీకాన్నికూడగట్టి వారికి హక్కులు నేర్పిన మహానుభావుడు జీఆర్ అన్నారు.ఆయన పోరాట స్మతులను గుర్తు చేసుకున్నారు.చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ఇంటి బిడ్డగా ఆయా గ్రామాలకు రోడ్డు సౌకర్యం, ఆయా కుటుంబాలకు కరెంట్ సౌకర్యం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి జీఆర్ అని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ కషి చేయాలని, పార్టీ ఎదుగుదలకు పాటుపడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, గౌతమ్‌రెడ్డి, రవినాయక్, సీతారాములు, మండల కార్యదర్శి రాంమ్మూర్తి, శశిధర్ రెడ్డి, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు రెమడాల పరుశురాములు, మహిళా సంఘం నాయకురాలు గాదె పద్మ, వరలక్ష్మి, సర్పంచ్ సైదమ్మ, శాఖ కార్యదర్శులు నగేష్, శీను, సుధాకర్, వెంకన్న, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.