Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగు,తాగునీరులేకపోవడంతో ఈ ప్రాంత భూములు బీటలు వారుతున్నాయని, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.గురువారం రాత్రి మండల ంలోని వెల్మకన్నె గ్రామంలో నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడారు.జిల్లాలోని డిండి ప్రాజెక్టు ద్వారా మూడులక్షల ఎకరాలకు నీళ్లు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టును పూర్తి చేసుకొని పూర్తి చేస్తామన్న ప్రభుత్వం డిండి ప్రాజెక్ట్ నిర్మాణానికి కనీసం డీపీఆర్ (డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్)అప్లోడ్ చేయకుండా కనీసం నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ప్రాంతాల్లో కనీసం భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టులను ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.డీపీఆర్ అమలు చేసి రాబోయే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి పనులు వేగవంతం చేయాలన్నారు.ి్ట ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి నల్గొండ మునుగోడు దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ మద్దతు ఇచ్చిన ఈ విధంగా రైతు వ్యతిరేకచట్టాలు, విద్యుత్ చట్టానికి మద్దతు ఇస్తే రానున్న రోజుల్లో ప్రజలు టీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం మాట్లాడుతూ టీిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకొచ్చాక ప్రతి పల్లెకు వచ్చే బస్సులను ప్రధాన రహదారులకు పరిమితం చేశారని విమర్శించారు.గతంలో మాదిరిగా ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రతి గ్రామంలో సీసీరోడ్లు, మురికికాలువ నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, సీపీఐఎం మండల కార్యదర్శి మిర్యాల వెంకన్న, జిల్లా నాయకులు చాపలమారయ్య, సీనియర్ నాయకులు గోపాల్‌రెడ్డి, పర్సనగోని యాదగిరి, అబ్బయ్య, నర్సింహ, శేఖర్, రాములు, గోపాల్ పాల్గొన్నారు.