Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలకంటి రంగారెడ్డి
నేరేడుచర్ల: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక పురపాలక కేంద్రంలో నిర్వహించిన పార్టీ జిల్లా జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత బందు పథకం దళితుల ప్రయోజనం కోసం మంచిదే అయినా ఆచరణకు రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతుందని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణకు రూ.4 లక్షల కోట్లు కోట్లు అప్పు తెచ్చాడన్నారు. ఆచరణ సాధ్యం కాని పథకాలు తేవడం కేసీఆర్కు కొత్తేమీ కాదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి నేటి వరకూ ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, కొల్లి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, ధీరావత్ రవినాయక్, నేరేడుచర్ల మండల కార్యదర్శి కొదమగుండ్ల నగేష్, పాలకవీడు కార్యదర్శి కందగట్ల అనంతప్రకాష్, షేక్ యాఖూబ్, నగారపు పాండు, వట్టెపల్లి సైదులు, పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.