Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-త్రిపురారం
స్థానిక మండలపరిషత్ కార్యాల యంలో ఎంపీపీ అనుముల పాండమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధి కారులు, ప్రజాప్రతి నిధులు అందరూ హాజరుకాక పోవడంతో ప్రజాసమస్యలకు పరిష్కారం జరగలేదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.మహిళా సర్పంచులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు బదులు వారి భర్తలు పాల్గొని అధికా రులను పలు సందేహాలు అడిగారు.అటు ప్రజాప్రతి నిధులు, అధికారులు కూడా సరిగా హాజరు కాకుండా వారి సిబ్బందిచే సమాధానాలు సభ ముందు చదివి వినిపించారు.వాటిపై వివరణ అడిగిన ప్రజాప్రతినిధులకు తర్వాత సమాచారం ఇస్తామన్న ధోరణిలో బదులు చెప్పారు.పలు గ్రామాలకు చెందిన సర్పంచులు స్థానికంగా నివాసముండకపోవడంతో హాజరుకాలేదన్న విమర్శలు వినవస్తున్నాయి.చాలా గ్రామాల కార్యదర్శులు కూడా సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం.కొందరు ప్రజాప్రతినిధులు మండలకేంద్రానికి వచ్చి కూడా సమావేశానికి హాజరుకాలేదని సమాచారం.ఎమ్మెల్యే నోముల భగత్ సర్వసభ్య సమావేశానికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పలువురు సర్పంచులు, ఎంపీటీలు, సమావేశానికి వచ్చినట్టు వచ్చివెళ్లిపోయారు.అధికారులు కూడా మండల సమావేశం ఉదయం 10.30 గంటలకు అని చెప్పి 11 గంటలకు సమావేశం ప్రారంభి ంచారు.సమావేశంలో అధికారులు వారు రాసుకొచ్చిన ప్రసంగం చదివి వినిపించి చేతులు దులుపుకున్నారు. అధికారులు వారి వంతు వచ్చినప్పుడు తెచ్చుకున్న సమాచారం చదివి సభ నుండి వెళ్లిపోవడంతో మార్కెట్ కమిటీ చైర్మెన్ జానయ్య ఇదేంటని ప్రశ్నించారు.అయినా అధికారుల్లో మార్పు రాకుండా సమావేశం ముగిసే సరికి అధికారులంతా అక్కడ నుండి జారుకున్నారు.విద్యుత్ శాఖ అధికారులపై ప్రజా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి సమా ధానాలు చెప్ప లేక విద్యుత్ శాఖ అధికారులు తల్లడిల్లారు.మిషన్ భగీరథ అధికారులు ప్రజాప్రతినిధులు అడిగిన సమాధానాలకు పొంతన లేని జవాబులు చెప్పారన్న విమర్శలు వినవస్తున్నాయి.మరికొంతమంది ప్రజాప్రతినిధులు ముచ్చట్లతో కాలక్షేపం చేశారు.కొందరు ప్రజా ప్రతినిధులు రెవెన్యూశాఖ వారిని రేషన్ దుకాణాల్లో ఉన్న ఇబ్బందులను తహసీల్దార్ దష్టికి తీసుకువచ్చారు.రేషన్ దుకాణాలకు వచ్చే కిరోసిన్, పంచదార వివరాలను తెలియజేయాలని వివరణ కోరడంతో తహసీల్దార్ సమాధానం చెప్పలేకపోయారు.ఈ సమావేశంలో ఎంపీడీఓ అలివేలు మంగ, తహసీల్దార్ ప్రమీల, జెడ్పీటీసీ భారతి, వైస్‌ఎంపీపీ యాదగిరి, మార్కెట్ కమిటీచైర్మెన్ జానయ్య, ఎంఈఓ బాలాజీనాయక్, త్రిపురారం సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఫ్యాక్స్ చైర్మెన్ జయరాంనాయక్, అధికారులు పాల్గొన్నారు.