Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకరెడ్డి
నవతెలంగాణ - డిండి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, కార్మిక, వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని టి గౌరారం గ్రామ శాఖ మహాసభలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడేండ్లల్లో నయా ఆర్ధిక విధానాలను దూకుడుగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను విచ్చలవిడిగా ప్రయివేటీకరణ చేస్తూ కీలక రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తోందన్నారు. మోడీ విధానాలతో కొత్త ఉద్యోగాలు రాక పోగా కోట్లాది మంది ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నీరుగార్చి కార్మికులను బానిసత్వంల్లోకి నెట్టేందుకు తెచ్చిన నాలుగు కోడ్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. కూర పార్వతమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ మహాసభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, నాయకులు నల్లా వెంకటయ్య, బిజిలి లింగయ్య, నల్ల శ్రీను, పేర్ల యాదగిరి, లక్ష్మయ్య, శివ, అంజి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.