Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ - భువనగిరి
భూమికోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ విప్లవ సాయుధ రైతాంగ పోరాటం కీలక భూమిక పోషించి పోరాడిన మహాయోధులు కాశం కష్ణ మూర్తి స్ఫూర్తితో భూమిలేని పేదలకు ప్రభుత్వ భూముల పంపిణీ కోసం పోరాడుతామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ అన్నారు.ఆదివారం స్థానిక సుందరయ్య భవన్ భువనగిరిలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు కష్ణ మూర్తి 15 వ వర్థంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కొండమడుగు పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ కష్ణ మూర్తి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నిర్మాత లలో ఒకరుగా, ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడుగా అనేక కూలీ, భూమి పోరాటాల రూప కల్పనలో కీలక పాత్రను పోషించారని తెలిపారు. రాష్ట్రంలో అభివద్ధి పేరుతో అట్టడుగు వర్గాల చేతిలో వున్న అసైన్డ్ భూములను, ఆదివాసీ గిరిజనుల చేతిలో సాగులో వున్న అటవీ భూములను లాక్కొనే పని చేస్తున్నారన్నారు. కష్ణ మూర్తి స్ఫూర్తితో భూమిలేని పేదలకు భూమి కోసం, ప్రభుత్వ భూముల రక్షణ కోసం రానున్న కాలంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మాయ కష్ణ పాల్గొన్నారు.
మోత్కూరు:పేద ప్రజలు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం పోరాడుతూ వారి వెన్నంటి ఉన్న పేదల నాయకుడు కాచం కష్ణమూర్తి అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి అన్నారు. కాచం కష్ణమూర్తి 15వ వర్థంతి సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆదివారం మోత్కూరులో ఆయన చిత్రపటానికిపూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని భూస్వాములను,రజాకార్లను తరిమికొట్టి వేల ఎకరాల భూములను పేదలకు పంచి పేదోళ్ల గుండెల్లో నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు కూరేళ్ల నర్సింహ, కందుకూరి నర్సింహ, బొల్లు సాయిలు, మురళి, రుద్రవెల్లి నర్సింహ, రంగమ్మ, ప్రవీణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.