Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించు కొని ఆదివారం జిల్లాలో స్నేహితుల ప్రెండ్షిప్ బ్యాండ్, కేకులు కట్ చేస్తూ ప్రత్యేకమైన భోజన ఏర్పాట్లతో నిర్వహించుకున్నారు. తమ పూర్వ విద్యాలయాలకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.
నవభారత్ డిగ్రీ కళాశాలలో...
నవభారత్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహితులందరూ కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ కార్యక్రమంలో లో ఉన్న విద్యార్థులు పడిగెలా ప్రదీప్, నరేష్, బల్ల యాదేశ్, భాస్కర్, గుండు మాధవరెడ్డి, బుర్రి సిద్ధి రాజు, భట్ట ఉపేందర్, కిషోర్, మహేందర్, శ్రీను, బాలకష్ణ పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రెసిడెన్సీ స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. అర్ధశతాబ్దపు వయసు దాటిన క్లబ్ సభ్యులు ఉత్సాహంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ శెట్టి బాలయ్య యాదవ్, అధ్యక్షులు చెన్న లక్ష్మణ్, సభ్యులు కొండల్ రెడ్డి, గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అశోక్ కుమార్, భాస్కర్ రెడ్డి, బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు.
మోత్కూరు:మున్సిపల్ కేంద్రంలో ఫ్రెండ్ షిప్ డే వేడుకలను ఆదివారం స్థానిక షటిల్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు కేక్ కట్ చేసి, ఫ్రెడ్ షిప్ బ్యాండ్స్ కట్టుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నిజమైన స్నేహానికి కులం, మతం, ప్రాంతం, ఆస్తులు అడ్డుకావన్నారు. కార్యక్రమంలో షటిల్ క్లబ్ అధ్యక్షుడు వెలిమినేటి జహంగీర్, కోశాధికారి బయ్యని నర్సింహ, సభ్యులు తుంగ గోపీనాథ్, జినుక సైదులు, మర్రి అనిల్ కుమార్, పోచం సోమయ్య, అన్నెపు యాకు, అమత్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట: మండలంలోని నీర్నేముల గ్రామం లో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రాధమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రవి, నోముల యాదగిరి స్వేరో, వార్డు సభ్యులు సుర్వి సతిష్, ముత్యాల కిషన్ తదితరుల పాల్గొన్నారు.
ఆలేరు టౌన్: మండల కేంద్రంలో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్ షిప్‌డే కార్యక్రమంలో వాసవి పరపతి సంఘం అధ్యక్షులు (సముద్రాల) ఐడియా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఒకరికొకరు స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కస్తూరి వెంకటేష్ ,తోట శివ, నీల రామన్న, పడకంటి సందీప్ , సముద్రాల రవి, సముద్రాల శివ, నాగబండి నాగేందర్,. మిత్రులు బీజేపీ నాయకులు బందెల సుభాష్, శేఖర్‌రావు, కిషోర్,తదితరులు పాల్గొన్నారు .