Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు
నవతెలంగాణ-నల్గొండ
రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని కోరుతూ సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ అభిమన్యుశ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ,వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కంభం కష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు ,కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిందన్నారు. వాటి రద్దు కోసం గత ఎనిమిది నెలలుగా ఢిల్లీలో రైతాంగం పోరాటాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశం రక్షణ దినంగా పాటిస్తూ గ్రామ ,మండల ,పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు తుమ్మల పద్మ, పోలే సత్యనారాయణ, ఊటుకూరు మధుసూదన్ రెడ్డి, అన్న బిమోజు పద్మ, గడ్డం రాములు, తదితరులు పాల్గొన్నారు.