Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మున్సిపల్ కేంద్రంలో పట్టణ ప్రగతి లో భాగంగా లక్షలు వెచ్చించి తెచ్చిన హరితహారం మొక్కల పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆలేరు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు . మున్సిపల్ కార్యాలయం ఆవరణలో హరిత హారంలో నాటాల్సిన మొక్కలు నిర్లక్ష్యంగా పడేశారని, నీళ్లు పోయనందున మొక్కలు ఎండిపోయాయని తెలిపారు. నర్సరీలలో రిజెక్ట్ చేసినటువంటి మొక్కలను తీసుకొచ్చి ఇంటికి ఐదు చొప్పున పంచారని తెలిపారు. ఆలేరు మున్సిపాలిటీ డెవలప్ మెంట్ కు సంబంధించిన నిధులను పట్టణ ప్రగతి పేరుతో దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ అంశంపై విచారణ జరిపించాలని కోరారు.