Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా ప్రధానకార్యదర్శి బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ-చౌటుప్పల్
మహిళల సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని ఐద్వా జిల్లా ప్రధానకార్యదర్శి బట్టుపల్లి అనురాధ తెలిపారు. ఆదివారం మున్సిపల్ కేంద్రంలోని సీపీఐ(ఎం) పట్టణ కార్యాలయంలో ఐద్వా ద్వితీయ మహాసభ బత్తుల జయమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై పెరుగుతున్న హింస, వివక్ష, అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఐద్వా సంఘం పోరాడుతుందన్నారు. ఐద్వా పోరాటాల వల్లే గహహింస, నిర్భయ, లైంగిక వేదింపుల నిరోధక చట్టాలు వచ్చాయన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు దోనూరి నిర్మల మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెంచి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్చేశారు. అనంతరం నూతనకమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా అర్షియా బేగం, ఉపాధ్యక్షురాలిగా బత్తుల జయమ్మ, గోశిక సుమతి, ప్రధానకార్యదర్శిగా అవ్వారి రామేశ్వరి, సహాయకార్యదర్శులుగా దండ హిమబిందు, బత్తుల లత, కోశాధికారిగా దొడ్డి ఆండాలు, కమిటీ సభ్యులుగా ఆయుషాబేగం, సుల్తాన్ బేగం, రేష్మబేగం, ఫర్హాత్, వీరమల్ల యాదమ్మ, రిజ్వానా, హలీమా, గోపగోని సుజాత, కోడెం వినోదలను ఎన్నుకున్నారు.