Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశానికే తలమానికంగా దళిత బంధు
- నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి
నవతెలంగాణ-నకిరేకల్
దళిత బంధు పథకం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దుయ్యబట్టారు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు దళిత బంధు పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం ప్రవేశ పెడుతున్నారని వెంటనే రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం దళితుల అభివద్ధి అడ్డుకోవడమే నన్నారు. దేశానికి తలమానికంగా దళిత బంధు పథకం నిలుస్తుందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చేయలేని సాహసోపేత నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొని దళిత సంక్షేమం కోసం వారి అభివద్ధి కోసం కషి చేసేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇది జీర్ణించుకోలేని బీజేపీ ,కాంగ్రెస్ నాయకులు అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దళితుల మాదిరిగానే ఎస్టీలకు, బీసీ కులాల అభివద్ధి కోసం త్వరలో పథకాల రూపకల్పన జరుగుతుందని పేర్కొన్నారు. ఈమధ్య సా మాజిక మాధ్యమాలలో ఎమ్మెల్యేలు చస్తే నియోజకవర్గాలు అభివద్ధి చెందుతాయని వైరల్ అవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు చేస్తే అభివద్ధి ఎలా జరుగుతుందో వివరించాలన్నారు. పార్టీలు మారితే అభివద్ధి జరగదని చేస్తున్న ప్రచారం ఒక భ్రమేనని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ ప ల్ రెడ్డి మహేందర్ రెడ్డి, నాయకులు నడికుడి వెంకటేశ్వర్లు, గొర్ల వీరయ్య, ఎం పీటీసీ కిషోర్, కౌన్సిలర్లు పల్లె విజరు ,బానోతు వెంకన్న, నాయకులు ఎస్.కె అమీర్ భాషా, గుర్రం గణేష్, చెవు గొని సైదులు, చింత త్రిమూర్తులు, సైదా రెడ్డి పాల్గొన్నారు.