Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉజ్జినీ రత్నాకర్ రావు డిమాండ్..
నవతెలంగాణ -మునుగోడు
భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 55 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి నెలకు రూ.3వేల పింఛన్ ఇవ్వాలని (ఏఐటీయూసీ) భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉజ్జైని రత్నాకర్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం మునుగోడు మార్కెట్ యార్డ్లో నిర్వహించిన ఆ సంఘం మండల10 వ మహా సభలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ చట్టం సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు కార్మికులకు సరైన సేవలు అందించడంలో విఫలం అయిందని ఆరోపించారు. లేబర్ అధికారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం ఏఐటీయూసీ అండగా నిలబడి నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ సేవల ద్వారా కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని లేబర్ ఆఫీసు లోనే భవన నిర్మాణ కార్మికుల పనులు జరిగే విధంగా చూడాలని కోరారు. పందుల నరసింహ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి చాపల శ్రీను అధ్యక్షుడు దుబ్బ వెంకన్న ,భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పెద్ద నరసింహ, నీరుడు సైదులు, శివయ్య, రామలింగయ్య, చిన నర్సింహ, మాలద్రి,పాపయ్య, యాదయ్య, క్రిష్ణయ్య,మారయ్య, వెంకన్న, కష్ణ, నర్సింహ, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.