Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
మండలంలోని మర్రూరు గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నందున వైద్య శిబిరం నిర్వహించాలని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని మరూరు గ్రామాన్ని సందర్శించి విష జ్వరాల బారిన పడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో డెంగ్యూ. మలేరియా. టైఫాయిడ్ విష జ్వరాలు ప్రబలి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలన్నారు. దోమల మందు పిచికారి,మురికి కాలువలు శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరారు. ఆయన వెంట వార్డు సభ్యులు పుట్ట శైలజ దశరథ, నాయకులునర్సింగ్ శేఖర్ గౌడ్ , నకిరేకంటి వెంకన్న , నడ్డి వెంకన్న యాదవ్ , నకిరేకంటి యాదయ్య , యం.డి యూసుఫ్ , పందిరి సతీష్ , మాచర్ల నరేష్ ఉన్నారు.