Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గసభ్యులు కూన్రెడ్డి నాగిరెడ్డి
నవతెలంగాణ-పెద్దవూర
నాగార్జునసాగర్ ఉపఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియా బహిరంగ సభలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కూన్రెడ్డి నాగిరెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని పార్టీ శాఖ 4వ మహాసభ ఎండీ యూసుఫ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగసభ పెట్టి డిగ్రీ కాలేజీ ఏర్పాటు, లిఫ్టుల నిర్మాణం, గిరిజనులు పోడుభూముల సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి, ఇతర హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.చిత్తశుద్ధితో సమీక్షలు చేయాలి తప్ప ఆర్భాటాల కోసం ప్రజలను మభ్యపెట్టడానికి చేయొద్దన్నారు.ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నికరంగా నిరంతరం పోరాడేది ఎర్రజెండా మాత్రమేనన్నారు.పేరుకే నాగార్జునసాగర్ మున్సిపాలిటీ అని, ఏర్పడిన నాటి నుండి ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని విమర్శించారు.కనీసం చెత్తకుండీలు, మురికికాలువలు ఏర్పాటు, రోడ్లు గుంతలమయంగా ఉన్నాయన్నారు.ఈ మహాసభలో పార్టీ పెద్దవూర మండలకార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య, శాఖకార్యదర్శి దోంతాల నాగార్జున,మూర్తి, స్వామి, కృష్ణ, రమణ, ఖాదర్, మరియమ్మ, సారమ్మ, ఖైరున్నీసా, గోవిందమ్మ, రమణమ్మ పాల్గొన్నారు.