Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమబోర్డులో నెలకొన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్క రించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు.ఆదివారం హుజూర్నగర్లో స్థానిక శిల్పకళా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలో రెండేండ్లుగా పెండింగ్ క్లయిమ్లు పరిష్కారం కావడం లేదని కార్మికశాఖ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.వెల్ఫేర్బోర్డు నిధుల నుండి 55 ఏండ్లు దాటిన ప్రతి కార్మికుడికి రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అలాగే సేవ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈనెల 9వ తేదీన కలెక్టరేట్ ముందు జరిగే ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులను కోరారు.ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి, ఎల్కసోమయ్య గౌడ్, ఉపతల గోవిందు, షేక్ ముస్తాఫా, ఉప్పతల వెంకన్న, ఉప్పతల నరేష్, పల్లపు రామకష్ణ, శీలం వేణు, షేక్ నజీర్, బుద్ధి నర్సింహారావు, సైదులు, నాగుల్ మీరా, పగిళ్ల సోమేశ్, అంజి, అశోక్ పాల్గొన్నారు.